Sunday 30th August 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ‘బ్యూటీఫుల్’..ఇటలీ ప్రధానిని పొగిడిన ట్రంప్

‘బ్యూటీఫుల్’..ఇటలీ ప్రధానిని పొగిడిన ట్రంప్

Trump calls Italian PM Meloni ‘so beautiful’ | ఇటలీ ప్రధాని జార్జియా మెలోని పై పొగడ్తల వర్షం కురిపించారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. హమాస్-ఇజ్రాయిల్ మధ్య యుద్ధానికి ముగింపు పలికేందుకు 20 సూత్రాల శాంతి ప్రణాళికతో ట్రంప్ ముందుకువచ్చారు.

సోమవారం ఈజిప్ట్ లో జరిగిన శాంతి సదస్సుకు ప్రపంచ నేతలు హాజరయ్యారు. ఇందులో భాగంగా ఇటలీ ప్రధాని మెలోని కూడా వచ్చారు. ఈ సదస్సులో మాట్లాడిన ట్రంప్ శాంతి ప్రణాళిక గురించి వివరించారు. ఇదే సమయంలో సమావేశానికి వచ్చిన ప్రపంచ నేతలకు కృతజ్ఞతలు చెప్పారు. ఈ సందర్భంగానే మెలోనిని బ్యూటీఫుల్ లేడీ అని సంభోధించారు.

‘అమెరికాలో మహిళను బ్యూటీఫుల్ అని అంటే రాజకీయ జీవితం ముగుస్తుంది. అయినప్పటికీ నేను రిస్క్ తీసుకుంటా. ఎందుకంటే ఆమే నిజంగానే అందంగా ఉంది. నేను ఇలా అన్నందుకు మీకు ఏమైనా అభ్యంతరమా, లేదు కదా ఎందుకంటే మీరు నిజంగానే అందంగా ఉన్నారు’ అని మెలోనిపై పొగడ్తల వర్షం కురిపించారు ట్రంప్. దింతో మెలోనితో సహా ఇతర దేశాధినేతలు నవ్వులు పూయించారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions