Tuesday 15th September 2026
12:07:03 PM
Home > క్రీడలు > హర్షిత్ పై ట్రోలింగ్..గరం అయిన గంభీర్

హర్షిత్ పై ట్రోలింగ్..గరం అయిన గంభీర్

Gautam Gambhir rips apart ex-India cricketers for targeting Harshit Rana | టీం ఇండియా ప్లేయర్ హర్షిత్ రాణా పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం సిగ్గుచేటన్నారు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్. అంతగా ఫార్మ్ లో లేకున్నా, అతడి కంటే మెరుగైన ఆటగాళ్లు ఉన్నప్పటికీ హర్షిత్ రాణా కు వరుస అవకాశాలు ఇవ్వడం పట్ల నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

పలువురు మాజీ క్రికెటర్లు సైతం హర్షిత్ రాణా ఎంపికపై ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజగా స్పందించారు గంభీర్. ఒక 23 ఏళ్ల యువకుడిని వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని దాడి చేయడం సిగ్గుచేటన్నారు. ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకోవడం న్యాయం కాదన్నారు.

సోషల్ మీడియా ట్రోలింగ్ సరైనది కాదని అతని మనస్థత్వాన్ని ఊహించుకోవలని పేర్కొన్నారు. యూట్యూబ్ ఛానెల్ వ్యూస్ కోసం ఇలాంటి విమర్శలు చేయడం సరికాదన్నారు. ‘కావాలనుకుంటే నన్ను ట్రోల్ చేయండి. నేను తట్టుకోగలను. అలాగే హర్షిత్ తో పాటే ఇతర యువ ఆటగాళ్లను టార్గెట్ చేయొద్దు’ అని గంభీర్ స్పష్టం చేశారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions