Friday 4th October 2024
12:07:03 PM
Home > క్రీడలు > విరాట్ కోహ్లీ భద్రతకు ముప్పు.. నలుగురు ఉగ్రవాదుల అరెస్ట్!

విరాట్ కోహ్లీ భద్రతకు ముప్పు.. నలుగురు ఉగ్రవాదుల అరెస్ట్!

virat kohli

Virat Kohli | ఐపీఎల్ (IPL Playoffs) ప్లే ఆఫ్స్ లో భాగంగ బుధవారం రాత్రి అహ్మదాబాద్ స్టేడియం వేదికగా బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కంటే ముందు మంగళవారం బెంగళూరు టీం తన ప్రాక్టీస్ మ్యాచ్ ను రద్దు చేసుకుంది.

విరాట్ కోహ్లీ భద్రతకు ముప్పు పొంచివున్న కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సోమవారం రాత్రి అహ్మదాబాద్ లో నలువురు ఉగ్రవాదులను గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి ఆయుధాలు, పలు వీడియో సందేశాలను స్వాధీనం చేసుకున్నారు.

ఈ నేపథ్యంలో అహ్మదాబాద్ లోనే ఉన్న బెంగళూరు, రాజస్థాన్ టీం లకు ఈ సమాచారాన్ని అందించారు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ భద్రతకు మరియు ఇతర ప్లేయర్స్ సెక్యూరిటీ ని దృష్టిలో ఉంచుకొని మంగళవారం జరగాల్సిన ప్రాక్టీస్ మ్యాచ్ ను యాజమాన్యం రద్దు చేసింది.

అంతేకాకుండా ఆర్సీబీ, రాజస్థాన్ టీం లు ఉండే హోటల్ వద్ద కూడా భారీ సెక్యూరిటీని పోలీసులు ఏర్పాటు చేశారు. అలాగే బుధవారం రాత్రి జరగబోయే మ్యాచ్ కోసం కూడా టైట్ సెక్యూరిటీ ను ఏర్పాటు చేశారు.

You may also like
ipl 2024 playoffs
IPL 2024: ప్లే ఆఫ్స్ కి చేరిన జట్లలో ఈ కామన్ పాయింట్ గమనించారా!
polling in faizabad
5TH PHASE POLLING.. రామజన్మ భూమిలో బీజేపీ గెలుపు ఖాయమా!
rcb vs csk
RCB డ్రెస్సింగ్ రూమ్ లో ఎంఎస్ ధోని!
virat kohli
రిటైర్మెంట్ తర్వాత మీకు కనిపించను: విరాట్ కోహ్లీ!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions