Wednesday 13th August 2025
12:07:03 PM
Home > తాజా > పదేళ్లు కనిపించని కరెంట్ కోతలను చూస్తున్నం: కేటీఆర్

పదేళ్లు కనిపించని కరెంట్ కోతలను చూస్తున్నం: కేటీఆర్

ktr

KTR Slams Congress | పదేళ్లు కనిపించని కరెంట్ కోతలను కాంగ్రెస్ ప్రభుత్వంలో తిరిగి చూస్తున్నామని విమర్శించారు మాజీ మంత్రి, బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

“6 దశాబ్దాల కన్నీటి దృశ్యాలు..!
6 నెలల కాంగ్రెస్ పాలనలోనే ఆవిష్కృతం..!!
పదేళ్లు కనిపించని కరెంట్ కోతలను చూస్తున్నం
విద్యుత్తు సబ్ స్టేషన్ల ముట్టడిలను చూస్తున్నం
కాలిన మోటర్లు, పేలిన ట్రాన్స్ ఫార్మర్లు చూస్తున్నం
ఇన్నాళ్లకు ఇన్వర్టర్లు-జనరేటర్ల మోతలు చూస్తున్నం
సాగునీరు లేక ఎండిన పంట పొలాలను చూస్తున్నం
ట్రాక్టర్లు ఉండాల్సిన పొలంలో ట్యాంకర్లు చూస్తున్నం
చుక్కనీరు లేక బోసిపోయిన చెరువులను చూస్తున్నం
పాత అప్పు కట్టాలని రైతులకు నోటీసులు చూస్తున్నం
రైతుబంధు కోసం నెలలపాటు పడిగాపులు చూస్తున్నం
తడిసిన ధాన్యాన్ని కొనే దిక్కు లేని దుస్థితి చూస్తున్నాం
పదేళ్ల తరువాత అన్నదాతల ఆత్మహత్యలు చూస్తున్నం

చివరికి ఇవాళ జోగిపేటలో విత్తనాల కోసం రైతుల మొక్కులు క్యూలైన్ లో పాసు బుక్కులు చూసినం!కాంగ్రెస్ తప్పులు ఆగడం లేదు..! అన్నదాతలకు తిప్పలు తప్పడం లేదు” అని రాసుకొచ్చారు కేటీఆర్

You may also like
bjp telangana
పౌరసత్వం రాకముందే ఓటర్ జాబితాలో ఆమె పేరు: బీజేపీ
Rain Alert
భారీ వర్షాలు.. 72 గంటలుఅప్రమత్తంగా ఉండాలి!
వీధి కుక్కలపై సుప్రీం తీర్పు..సీజేఐ కి అడవి శేష్ లేఖ
మంత్రి పదవిపై కోమటిరెడ్డి మరో బాంబ్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions