Saturday 26th July 2025
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > 5TH PHASE POLLING.. రామజన్మ భూమిలో బీజేపీ గెలుపు ఖాయమా!

5TH PHASE POLLING.. రామజన్మ భూమిలో బీజేపీ గెలుపు ఖాయమా!

polling in faizabad

Polling In Ayodhya | సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సోమవారం 5వ దశ (5th Phase Polling) పోలింగ్ ప్రారంభం అయ్యింది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరిగాయి.

అయితే 5వ దఫా ఎన్నికల్లో అందరి చూపు ఉత్తర్ ప్రదేశ్ (Uttar Pradesh) లోని ఫైజాబాద్ (Faizabad) పార్లమెంటు స్థానం వైపే. కారణం అయోధ్య అసెంబ్లీ స్థానం ఈ పార్లమెంటు పరిధిలోకి వస్తుంది. ఈ ఏడాది జనవరి 22న అయోధ్య రామాలయం ప్రారంభం జరిగిన విషయం తెల్సిందే.

రామాలయ ప్రారంభ అంశాన్ని దేశ వ్యాప్తంగా బీజేపీ ప్రచారం చేస్తోంది. అయితే దేశంలో ఈ ప్రభావం ఎలా ఉంటుందో పక్కన పెడితే ఫైజాబాద్ లో రామాలయ ప్రభావం ఎలా ఉంటుందో అనేది ఆసక్తిగా మారింది. ఈ నియోజకవర్గంలో ఉన్న 26 శాతం దళిత ఓటర్ల జనాభా నిర్ణయాత్మకంగా ఉండనుంది.

ఇదిలా ఉండగా ఠాకూర్ సామాజిక వర్గానికి చెందిన సిట్టింగ్ ఎంపీ లల్లు సింగ్ ను బీజేపీ బరిలో నిలిపింది. ఇక పోతే దళిత సామాజిక వర్గానికి చెందిన అవదేశ్ ప్రసాద్ ఇండి కూటమిలో భాగంగా సమజ్వాదీ పార్టీ నుండి పోటీ చేస్తున్నారు. ఇక్కడ బీజేపీ వరుసగా రెండు సార్లు గెలిచినప్పటికీ క్రమేపీ సమజ్వాదీ పార్టీ తన ఓటింగ్ శాతాన్ని పెంచుకుంటుండడం ఆసక్తిగా మారింది.

You may also like
మాజీ మంత్రి కేటీఆర్ బర్త్ డే.. సోషల్ మీడియాలో కవిత పోస్ట్!
rosiah statue
దివంగత సీఎం రోశయ్య విగ్రహాన్నిఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్!
kcr
KCR ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేసిన యశోద హాస్పిటల్!
kavitha pressmeet
BJP అధ్యక్షుడి హోదాలో తొలి విజయం సాధించండి: ఎమ్మెల్సీ కవిత!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions