Wednesday 15th April 2026
12:07:03 PM
Home > తాజా > అనే నేను సర్పంచ్ గా..ప్రమాణస్వీకారం ఎప్పుడంటే!

అనే నేను సర్పంచ్ గా..ప్రమాణస్వీకారం ఎప్పుడంటే!

Telangana Panchayati Elections | తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా బుధవారం తుది విడత ఎన్నికలు ముగిశాయి. మొత్తం మూడు దశల్లో సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. ఇకపోతే రాష్ట్రవ్యాప్తంగా నూతనంగా ఎన్నికైన సర్పంచులు డిసెంబర్ 22న పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు పంచాయతీ రాజ్ శాఖ నిర్ణయించింది. ముందుగా ఈనెల 20 అనుకున్నప్పటికీ పలువురు ప్రజా ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

డిసెంబర్ 22న రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, ఎన్నికైన ప్రతినిధులతో ప్రమాణస్వీకారం చేయించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కార్యక్రమాన్ని పంచాయతీ కార్యదర్శులతో నిర్వహించాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ అన్ని జిల్లాల కలెక్టర్లు, పంచాయతీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

You may also like
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions