KCR Sister Passes Away | తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన ఐదవ సోదరి చీటి సకలమ్మ కన్నుమూశారు. దీంతో శనివారం మునిరాబాద్ లోని సకలమ్మ నివాసానికి చేరుకున్న కేసీఆర్ ఆమె పార్థివ దేహానికి నివాళి అర్పించారు.
ఆమె కుటుంబ సభ్యులను, బంధువులను ఓదార్చారు. కేసీఆర్ తో పాటు కేటీఆర్, హరీష్ రావు, కవిత పలువురు కుటుంబ సభ్యులు సకలమ్మ భౌతిక కాయానికి శ్రద్ధాంజలి ఘటించారు. కాగా, పూడూరులోని స్మశానవాటికలో సకలమ్మ అంత్యక్రియలు జరిగాయి.