Wednesday 7th October 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > నవజాత శిశువులకు ఉచితంగా 1 గ్రాము బంగారు ఉంగరం!

నవజాత శిశువులకు ఉచితంగా 1 గ్రాము బంగారు ఉంగరం!

  • ‘తాయిమామన్ తంగ మోతిర తిట్టం’ అమలుకు తమిళనాడు టీవీకే ప్రభుత్వం నిర్ణయం

TN Gold Ring Scheme తమిళనాడులోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించే ప్రతీ నవజాత శిశువుకు 1 గ్రాము బంగారు ఉంగరాన్ని ఉచితంగా అందించేందుకు తమిళగ వెట్రి కజగం (టీవీకే) ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఎన్నికల హామీల అమలులో భాగంగా “తాయిమామన్ తంగ మోతిర తిట్టం” (తల్లిమేనమామ బంగారు ఉంగరం పథకం) పేరిట దీనిని అందుబాటులోకి తెస్తోంది.

తమిళ సాంప్రదాయంలో మేనమామ ఇచ్చే కానుకల (తాయిమామన్ సీర్) ఆచారాన్ని పురస్కరించుకుని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ పథకాన్ని రూపొందించారు. మాజీ ముఖ్యమంత్రి సి.ఎన్. అన్నాదురై జయంతిని పురస్కరించుకుని సెప్టెంబర్ 15న ముఖ్యమంత్రి విలియం జోసెఫ్ విజయ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. జూన్ 22, 2026 నుంచి ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో జన్మించిన అర్హులైన శిశువులందరికీ ఇది వర్తిస్తుందని ప్రభుత్వం వెల్లడించింది.

ఈ పథకం కోసం ప్రభుత్వం ఏడాదికి ₹755.83 కోట్లు కేటాయించింది. ఏటా సుమారు 4.41 లక్షల మంది శిశువులకు 22 క్యారెట్ల (BIS 916 హాల్‌మార్క్) ఉంగరాలను సరఫరా చేసే కొనుగోలు టెండర్లలో ప్రముఖ ఆభరణాల ಸಂಸ್ಥ Joyalukkas ఎల్-1 బిడ్డర్‌గా నిలిచింది. బంగారం అసలు ధరను ప్రభుత్వమే భరిస్తుండగా, తయారీ, రవాణా, ఇన్సూరెన్స్ వంటి అనుబంధ ఖర్చుల కోసం జోయ్ ఆలుక్కాస్ కేవలం ₹0.01 (ఒక్క పైసా) సేవా రుసుమును కోట్ చేసి ఈ టెండర్‌ను దక్కించుకోవడం విశేషం.

You may also like
తమిళనాడు సీఎం విజయ్‌కి వైఎస్ షర్మిల కుమార్తె పెళ్లి పిలుపు!
మేనమామ గా మారిన సీఎం విజయ్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions