Sunday 14th June 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > అజిత్ పవార్ మృతిపై శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు!

అజిత్ పవార్ మృతిపై శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు!

ajit and sharad powar

Sharad Pawar On Plane Crash | మహారాష్ట్ర (Maharashtra) డిప్యూటీ సీఎం అజిత్ పవార్ (Deputy CM Ajith Pawar) బుధవారం జరిగిన విమాన  ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే.

ఈ ఘటనపై కొంతమంది రాజకీయ నాయకులు అనుమానం వ్యక్తం చేశారు.

బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamatha Banerjee) ఈ ప్రమాద ఘటనపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఎన్సీపీ సీనియర్ నాయకుడు, అజిత్ పవార్ బాబాయ్ శరద్ పవార్ (Sharadh Pawar) ఈ ఘటనపై కీలక వ్యాఖ్యలు చేశారు.

అజిత్ మృతి పట్ల తీవ్ర భావోద్వేగానికి గురైన ఆయన ఈ ఘటన ఇది కేవలం ప్రమాదం మాత్రమేనని, దీని వెనుక ఎలాంటి కుట్ర లేదని స్పష్టం చేశారు.

“అజిత్ పవార్ మరణంతో మహారాష్ట్రకు తీరని నష్టం వాటిల్లింది. ఒక సమర్థుడైన నాయకుడిని ఈ రోజు మనం కోల్పోయాం. ఈ లోటు ఎప్పటికీ పూడ్చలేనిది” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

అన్నీ మన చేతుల్లో ఉండవనీ, కొన్ని సంఘటనల వెనుక ఎలాంటి రాజకీయం ఉండదని వ్యాఖ్యానించారు. దయచేసి ఈ విషయాన్ని రాజకీయం చేయవద్దనీ విజ్ఞప్తి చేశారు.

You may also like
modi civic satyagraha call
బీ అలెర్ట్.. ప్రధాని మోదీ ‘సివిక్ సత్యాగ్రహం’ పిలుపు!
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
aiswarya rajesh
విజయ్ పై ఐశ్వర్య రాజేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions