Saturday 8th August 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > అమెరికాలో ‘తెలుగు భాష’ పై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు!

అమెరికాలో ‘తెలుగు భాష’ పై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు!

rahul gandhi

Rahul Gandhi Comments On Telugu | కాంగ్రెస్ అగ్రనాయకులు, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తెలుగు భాషపై కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన డల్లాస్ లో ప్రవాస భారతీయులతో సమావేశం అయ్యారు.

ఈ సందర్భంగా భారత దేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అని చెప్పారు. భాష, సంప్రదాయాల పేరుతో ఎవర్ని వేరుచేసి చూడొద్దని పేర్కొన్నారు. మన జాతీయ గీతం దేశాన్ని రాష్ట్రాల సమాఖ్య చెపుతుందని, అన్ని రాష్ట్రాలు సమానమే అన్ని తెలిపారు.

తమిళం మాట్లాడే వారు నచ్చరు, హిందీ మాట్లాడేవారు నచ్చుతారు అని చెప్పడం సరికాదని హితవుపలికారు. మనం తెలుగు భాష గురుంచి మాట్లాడినప్పుడు అది కేవలం ఒక భాషనే కాదు, ఒక చరిత్ర, సంప్రదాయం, సంస్కృతి.

హిందీ భాషతో పోల్చుతూ, తెలుగు అంత ముఖ్యం కాదని ఎవరైనా అంటే అది వారిని అవమానించినట్లే అని స్పష్టం చేశారు. ఈ చిన్న తేడాను కొందరు అర్ధం చేసుకోలేకపోతున్నారని బీజేపీపై రాహుల్ గాంధీ విమర్శలు చేశారు.

You may also like
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!
కాంగ్రెస్‌లో టీఎంసీ విలీనమా..? రూమర్లపై క్లారిటీ ఇచ్చిన కాంగ్రెస్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions