Thursday 16th April 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > పశ్చిమాసియాలో యుద్ధం..ఇజ్రాయెల్ ప్రధానితో మాట్లాడిన మోదీ

పశ్చిమాసియాలో యుద్ధం..ఇజ్రాయెల్ ప్రధానితో మాట్లాడిన మోదీ

PM Modi speaks with Netanyahu | ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ఫోన్లో మాట్లాడారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. ప్రస్తుతం పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు కలిసి ఇరాన్‌పై భారీ దాడులు చేస్తున్నాయి.

మరోవైపు తమ సుప్రీం లీడర్ అయతోల్లా అలీ ఖమేనీ మరణించిన నేపథ్యంలో ఇరాన్ ప్రతీకార చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా ఇజ్రాయెల్ తో సహా అనేక గల్ఫ్ దేశాలపై మిస్సైళ్ళు, డ్రోన్లతో విరుచుకుపడుతుంది.

ఈ పరిణామాల నేపథ్యంలో ప్రధానమంత్రి మోదీ నెతన్యాహుతో మాట్లాడారు. ఆదివారం రాత్రి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో ఫోన్‌లో మాట్లాడారు. అనంతరం మోదీ స్పందిస్తూ నెతన్యాహూతో ప్రాంతీయ పరిస్థితులపై మాట్లాడినట్లు వెల్లడించారు.

ఇటీవలి నెలకొన్న పరిణామాలపై ప్రధాని నెతన్యాహుతో ఆందోళన వ్యక్తం చేశారు. పౌరుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని నొక్కిచెప్పారు. శత్రుత్వాలు ముగించాలని పునరుద్ఘాటించారు. అంతకంటే ముందు ప్రధాని మోదీ యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్‌తో మాట్లాడి, ఆ దేశంపై ఇరాన్ చేసిన దాడులను తీవ్రంగా ఖండించారు.

You may also like
ఇరాన్ యుద్ధనౌకపై యూఎస్ దాడి..ప్రధానిపై రాహుల్ ఫైర్!
Iran warship hit by USA
WW-II తర్వాత అతిపెద్ద దాడి.. విశాఖ నుంచి వెళ్తున్న ఇరాన్ నౌకపై..
ఇరాన్ పై దాడులు..ఒక్క రోజే అమెరికాకు రూ.ఎన్నివేల కోట్ల ఖర్చంటే!
indians stranded in karachi airport
గల్ఫ్ లో గందరగోళం.. పాక్ లో చిక్కుకున్న భారతీయులు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions