Friday 5th June 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > WW-II తర్వాత అతిపెద్ద దాడి.. విశాఖ నుంచి వెళ్తున్న ఇరాన్ నౌకపై..

WW-II తర్వాత అతిపెద్ద దాడి.. విశాఖ నుంచి వెళ్తున్న ఇరాన్ నౌకపై..

Iran warship hit by USA

రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత శత్రు నౌకపై అమెరికా అతిపెద్ద దాడి జరిపింది. దీంతో శ్రీలంకకు సమీపంలోని అంతర్జాతీయ జలాల్లో అలజడి రేగింది.

ఫిబ్రవరి చివరి వారంలో భారత్ నిర్వహించిన మిలాన్-2026 మరియు ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో పాల్గొనేందుకు ఇరాన్ కు చెందిన యుద్ధనౌక ఐఆర్ఐఎస్ దేనా విశాఖకు చేరుకుంది.

వివిధ కార్యక్రమాలు, విన్యాసాలు ముగించుకుని తిరిగి స్వదేశానికి పయనం అయ్యింది. ఈ నేపథ్యంలో బుధవారం తెల్లవారుజామున ఐరిస్ దేనా యుద్ధనౌకపై అమెరికా జలాంతర్గామి టార్పెడో దాడి చేసింది. దింతో శ్రీలంక లోని గాలె పట్టణం నుంచి సుమారు 40 నాటికల్ మైళ్ళ దూరంలో ఇరాన్ యుద్ధనౌక మ్యూనిగిపోసాగింది.

దాడి జరిగిన సమయంలో నౌకలో మొత్తం 180 మంది ఉన్నారు. తెల్లవారుజామున 5.08 గంటలకు శ్రీలంక కోస్టుగార్డుకు అత్యవసర సందేశం వచ్చింది. వెంటనే రంగంలోకి దిగిన శ్రీలంక నౌకా, వైమానిక దళాలు సహాయక చర్యలు ప్రారంభించాయి. సుమారు 32 మందిని రక్షించాయి.

అలాగే 87 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాయి. మిగిలిన వారికోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని శ్రీలంక విదేశాంగ శాఖ మంత్రి విజిత హెరాత్ వెల్లడించారు. ఇరాన్ యుద్ధ నౌకపై దాడి చేసినట్లు అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సేత్ ధృవీకరించారు.

You may also like
modi civic satyagraha call
బీ అలెర్ట్.. ప్రధాని మోదీ ‘సివిక్ సత్యాగ్రహం’ పిలుపు!
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
aiswarya rajesh
విజయ్ పై ఐశ్వర్య రాజేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
నిజాయతీలో మా పిల్లలు బంగారం.. విద్యార్థినులపై మంత్రి లోకేశ్ ప్రశంసలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions