Monday 9th December 2024
12:07:03 PM
Home > తాజా > తెలంగాణ చూపు బీజేపీ వైపు : పీఎం మోదీ

తెలంగాణ చూపు బీజేపీ వైపు : పీఎం మోదీ

Pm Modi Meets Party Leaders From Telangana | తెలంగాణ బీజేపీ ( Telangana BJP )కి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు బుధవారం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు.

పార్లమెంటు భవనంలోని ప్రధాని కార్యాలయంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ( Kishan Reddy ) నేతృత్వంలోని బృందం ప్రధానిని కలిసి రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయం అంశాలపై చర్చించారు.

ఈ నేపథ్యంలో స్పందించిన ప్రధాని తెలంగాణ బీజేపీ శాసనసభ్యులు, ఎంపీలతో చాలా మంచి సమావేశం జరిగినట్లు చెప్పారు.

‘రాష్ట్రంలో మా పార్టీ ఉనికి వేగంగా విస్తరిస్తోంది. తెలంగాణ ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్‌తో విసిగిపోయారు అంతేకాక బీఆర్‌ఎస్ దుష్టపాలన వల్ల కలిగిన భయంకరమైన జ్ఞాపకాలతో ఉన్నారు. ఎంతో ఆశతో బీజేపీ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్‌ ( Congress ), బీఆర్‌ఎస్‌ ( Brs )ల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా భాజపా తన స్వరాన్ని గట్టిగా వినిపిస్తూనే ఉంటుంది. మా కార్యకర్తలు మా అభివృద్ధి ఎజెండాను వివరిస్తూనే ఉంటారు.’ అని మోదీ పేర్కొన్నారు.

You may also like
ktr
‘సీఎం రేవంత్.. తెలంగాణ తల్లులపై ఏమిటీ దుర్మార్గం?’ : కేటీఆర్
manchu family
మంచు ఫ్యామిలీలో ఏం జరుగుతోంది.. మోహన్ బాబు ఇంటికి బౌన్సర్లు?
allu amitabh
‘ఐకాన్ స్టార్ మేమంతా మీ అభిమానులమే’: అమితాబ్ బచ్చన్
ponnam prabhakar
తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ.. కేసీఆర్ కు మంత్రి ఆహ్వానం!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions