Giriraj Singh All Praise For Pawan Kalyan| ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ( Deputy Cm Pawan Kalyan )ను ఆకాశానికెత్తేశారు కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ ( Giriraj Singh ).
దేశంలోని హిందువుల హక్కుల కోసం పోరాడే నిజమైన యోధుడు పవన్ కళ్యాణ్ అంటూ కితాబిచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో భాగంగా ఎన్డీయే ఎంపీలకు విందును ఏర్పాటు చేశారు.
ఇందులో పలువురు కేంద్రమంత్రులు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లోని కూటమి ఎంపీలు హాజరయ్యారు. ఈ క్రమంలో విందుకు హాజరైన కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ పవన్ కళ్యాణ్ ను కలిసి అభినందించారు. మన సంప్రదాయాలను, విలువలను కాపాడుకోవడంలో పవన్ కళ్యాణ్ చూపిస్తున్న అచంచలమైన అంకితభావం అందరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు.
హిందువుల హక్కుల కోసం నిజమైన యోధుడు, హిందువులు మరియు హిందుస్తాన్ కు పవన్ ఒక ఆశాకిరణం అని పేర్కొన్నారు. అలాగే న్యాయం కోసం తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు.