Wednesday 24th June 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > సైబరాబాద్‌ గ్లోబల్ పవర్ హౌస్.. ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు!

సైబరాబాద్‌ గ్లోబల్ పవర్ హౌస్.. ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు!

modi

Modi’s Visit To Hyderabad | తెలంగాణ అభివృద్ధి పథంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఆదివారం హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ రూ. 9,400 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు చేశారు.

గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని, తెలంగాణను ‘మాన్యుఫ్యాక్చరింగ్ పవర్ హౌస్’గా మార్చడమే కేంద్ర లక్ష్యమని ప్రకటించారు.

“సైబరాబాద్ బలం కేవలం జాతీయ స్థాయిలోనే కాదు, అంతర్జాతీయ స్థాయిలోనూ ఎంతో కీలకం. తెలంగాణ మరియు దేశం శీఘ్రగతిన అభివృద్ధి చెందడానికి ఇది ఒక ప్రధాన ఇంజిన్” అని ప్రధాని ప్రశంసించారు.

2014కు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే బడ్జెట్ రూ. 1,000 కోట్లు కూడా ఉండేది కాదని, కానీ నేడు కేవలం తెలంగాణకే రూ. 5,500 కోట్లు కేటాయించామని ప్రధాని గుర్తుచేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో రూ. 50 వేల కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని వెల్లడించారు.

నేడు ప్రారంభించిన ప్రాజెక్టుల వల్ల వేలాది మంది యువతకు కొత్త ఉద్యోగాలు లభిస్తాయని, కనెక్టివిటీ మరింత మెరుగుపడుతుందని పేర్కొన్నారు.

“తెలంగాణ యువత కొత్త కలలు కంటున్నారు, ఇక్కడి రైతులు ఆశలతో ముందుకు సాగుతున్నారు. తెలంగాణ అభివృద్ధి చెందితేనే భారత్ అభివృద్ధి చెందుతుంది.

మీ కలలను నెరవేర్చడానికి కేంద్ర ప్రభుత్వం మరింత వేగంగా పనిచేస్తుందని ప్రతి కుటుంబానికి హామీ ఇస్తున్నాను” అని మోదీ ఉద్వేగంగా ప్రసంగించారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions