Monday 14th September 2026
12:07:03 PM
Home > క్రీడలు > ఐపీఎల్ ఆక్షన్ లో ఏ ఫ్రాంచైజీకి వెళ్తున్నావ్?.. పెర్త్ టెస్టులో వైరల్ వీడియో

ఐపీఎల్ ఆక్షన్ లో ఏ ఫ్రాంచైజీకి వెళ్తున్నావ్?.. పెర్త్ టెస్టులో వైరల్ వీడియో

Nathan Lyon Asks Rishab Pant About IPL Mega Auction | బోర్డర్-గావస్కర్ ( Border-Gavaskar ) ట్రోఫీలో భాగంగా పెర్త్ ( Perth ) వేదికగా ఆస్ట్రేలియా, ఇండియా మధ్య తొలి టెస్టు జరుగుతుంది. తొలుత బ్యాటింగ్ ( Batting ) చేసిన టీం ఇండియా 150 పరుగులకే ఆల్ ఔట్ అయ్యింది.

మరోవైపు ఆస్ట్రేలియా కూడా 67 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇదిలా ఉండగా రిషబ్ పంత్ క్రీజులో ఉన్న సమయంలో జరిగిన ఓ సంభాషణ ఇప్పుడు వైరల్ గా మారింది. ఆసీస్ స్పిన్నర్ నాథన్ లైయన్ ( Nathan Lyon ) బౌలింగ్ లో ఓ వైపు రిషబ్ పంత్, మరోవైపు నితీష్ రెడ్డి బౌండరీలు బాదారు.

ఈ క్రమంలో పంత్ ను డిస్టర్బ్ చేయడానికి లైయన్ ఓ ప్రశ్న సంధించాడు. ఐపీఎల్ మెగా ఆక్షన్ ( IPL Mega Auction ) లో ఈ ఫ్రాంచైజీకీ వెళ్తున్నావ్ అని లైయన్ అడిగాడు, దీనికి నాకేం తెలీదు అంటూ పంత్ బదులిచ్చాడు.

వీరి మాటలు స్టంప్ మైకులో రికార్డ్ అయ్యాయి. ఇదిలా ఉండగా అనూహ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ ( Delhi Capitals ) రిషబ్ పంత్ ను రిలీజ్ చేసిన విషయం తెల్సిందే. దీనితో పంత్ మెగా ఆక్షన్ లోకి వచ్చేశారు. వచ్చే ఆది, సోమవారల్లో సౌదీఅరేబియా రాజధాని జెద్దా వేదికగా ఐపీఎల్ మెగా ఆక్షన్ జరగనుంది.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions