Manchu Manoj Latest News | మంచు కుటుంబంలో గత కొన్ని నెలలుగా వివాదాలు జరుగుతున్న విషయం తెల్సిందే. అయితే కొన్ని రోజులు స్తబ్దుగా ఉండగా, తాజగా కుటుంబ వివాదాలు మళ్ళీ రోడ్డెక్కాయి.
హైదరాబాద్ జల్ పల్లిలోని మంచు మోహన్ బాబు నివాసం ముందు మనోజ్ బైఠాయించారు. ఇంట్లోకి వెళ్లేందుకు మనోజ్ యత్నించగా, గేట్లు తెరవలేదు. దింతో ఆయన గేటు ముందే బైఠాయించారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
మంగళవారం సోదరుడు మంచు విష్ణు తన కారును దొంగిలించారని పోలీసులకు మనోజ్ ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే. ఏప్రిల్ 1న కుమార్తె పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సమేతంగా రాజస్థాన్ జయపుర వెళ్లగా మంచు విష్ణు జల్ పల్లి నివాసంలోకి సుమారు 150 మందితో వచ్చి విలువైన వస్తువుల్ని, సామగ్రిని ధ్వంసం చేశారని ఫిర్యాదులో మనోజ్ పేర్కొన్నారు. తన కారును దొంగిలించి విష్ణు తన ఇంట్లో పెట్టుకున్నాడని ఆరోపించారు. కాగా ఈ వివాదం పై మోహన్ బాబు ఎలా స్పందిస్తారో అనేది వేచి చూడాలి.