CM Yogi Adityanath launches the release date poster for Kannappa | ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను ప్రముఖ తెలుగు నటుడు మంచు మోహన్ బాబు మరియు మంచు విష్ణు కలిశారు. సమావేశానికి సంబంధించిన ఫోటోలను విష్ణు ఎక్స్ ద్వారా షేర్ చేశారు.
విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు ‘కన్నప్ప’ మూవీ అతి త్వరలో విడుదల కానుంది. తొలుత ఈ సినిమా ఏప్రిల్ 25న విడుదల చేయాలని భావించినా విఎఫ్ఎక్స్ ఆలస్యం కావడంతో జూన్ 27కు వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో కొత్త రిలీజ్ డేట్ కు సంబంధించిన పోస్టర్ ను ముఖ్యమంత్రి యోగి విడుదల చేశారు.
సీఎంను కలిసేందుకు మోహన్ బాబు, విష్ణు బుధవారం ఉదయం లక్నో చేరుకున్నారు. సీఎం యోగి చూపిన ఆప్యాయతకు మోహన్ బాబు ధన్యవాదాలు తెలిపారు. అలాగే యోగి తాను అభిమానించే వ్యక్తుల్లో ఒకరని పేర్కొన్నారు విష్ణు.
కన్నప్ప మూవీ నూతన రిలీజ్ డేట్ పోస్టర్ ను సీఎం విడుదల చేయడం ఆనందంగా ఉందన్నారు. ఇకపోతే కన్నప్ప మూవీలో ప్రభాస్, మోహన్ లాల్, కాజల్, అక్షయ్ కుమార్, బ్రహ్మానందం వంటి అగ్ర నటులు గెస్ట్ రోల్ లో కనిపించనున్నారు.