Saturday 15th August 2026
12:07:03 PM
Home > తాజా > ‘మాది నిర్మాణం.. మీది విధ్వంసం’ ప్రభుత్వంపై కేటీఆర్ ఆగ్రహం!

‘మాది నిర్మాణం.. మీది విధ్వంసం’ ప్రభుత్వంపై కేటీఆర్ ఆగ్రహం!

ktr

KTR Fires On TG Govt | హైదరాబాద్ లో హైడ్రా (Hydraa) కూల్చివేతలకు సంబంధించి ప్రభుత్వంపై మండి పడ్డారు బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR). గత పదేళ్లలో తాము నిర్మిస్తే ఇప్పుడు మీరు కూల్చివేస్తున్నారంటూ విమర్శించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

“మాది నిర్మాణం – మీది విధ్వంసం.. లక్షల నిర్మాణాలు మావి – లక్షల కూల్చివేతలు మీవి.. మూసి నది సాక్షిగా ఇదిగిదిగో మహానగరం లో కేసీఆర్ లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు. కాంగ్రెస్ విష ప్రచారాలు అబద్దాలు అనడానికి మరో సాక్షం.

ఇదే కట్టలేదన్నారు-ప్రజలను మభ్యపెట్టాం అన్నారు – మరి లక్ష ఇండ్లు రాత్రికి రాత్రికి ఎక్కడ నుండి పుట్టుకొచ్చాయి చిట్టి. మీ పాలనలో మీ అధికారులే మీ టేబుల్ ముందు పెట్టిన డబుల్  లెక్కలు చూసి మతిపోతుందా.

కేసీఆర్ నిజం, ఆయన హామీలు నిజం ఆయన మాట నిజం అని తెలిసి మింగుడుపడటం లేదా? మీ జూటా మాటలు, మీ కుట్రలకు, మీ దిమాక్ తక్కువ పనుల డ్యామేజ్ కంట్రోల్ కు ఇవ్వాళా కేసీఆర్ గారి నిర్మాణాలే దిక్కయ్యాయి.

కేసీఆర్ లక్ష డబుల్ నిర్మాణాలు నిజం-కేటాయింపులు నిజం. మీ నాలుకలు తాటి మట్టాలు కాకుంటే ఇంకోసారి అబద్దాలు మాట్లాడకండి” అంటూ హితవు పలికారు కేటీఆర్.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
బీఆరెస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions