BSP Contesting Seats in TS | సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీఆరెస్ బీఎస్పీ (BRS-BSP)ల మధ్య పొత్తు కుదిరిన విషయం తెల్సిందే.
అందులో భాగంగా బీఆరెస్ అధినేత కేసీఆర్ (KCR) బీఎస్పీకి రెండు పార్లమెంట్ సీట్లను కేటాయించారు. నాగర్ కర్నూల్ (Nagar Kurnool) మరియు హైదరాబాద్ (Hyderabad) సీట్లను బీఎస్పీకి కేటాయిస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు.
దీంతో మిగిలిన 15 స్థానాల్లో గులాబీ పార్టీ పోటీ చేయనుంది. కాగా నాగర్ కర్నూల్ స్థానం నుండి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆరెస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) పోటీ చేయనున్నారు. ఈ క్రమంలో స్పందించిన ఆరెస్ ప్రవీణ్ కుమార్ కీలక ప్రకటన చేశారు.
“తెలంగాణ ప్రయోజనాలను కాపాడటానికి, దేశంలో బహుజనుల రక్షణకోసం ఈ పొత్తు ఒక చారిత్రాత్మక అవసరం తెలంగాణలో ఈ లౌకిక కూటమి నిస్సందేహంగా విజయ దుందుభి మోగించబోతోంది” అని ధీమా వ్యక్తం చేశారు.