Saturday 19th September 2026
12:07:03 PM
Home > తాజా > ‘ఆ మెసేజ్ లు నమ్మొద్దు..’ సీపీ సజ్జనార్ విజ్ఞప్తి!

‘ఆ మెసేజ్ లు నమ్మొద్దు..’ సీపీ సజ్జనార్ విజ్ఞప్తి!

CP Sajjanar Post | హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ (VC Sajjanar) నెటిజన్లకు కీలక విజ్ఞప్తి చేశారు. సైబర్ నేరగాళ్లు తన పేరుతో నకిలీ ఫేస్ బుక్ ఖాతా సృష్టించారని తెలిపారు. తాను ఆపదలో ఉన్నానని.. డబ్బులు పంపాలని మోసపూరిత మెసేజ్లు పంపిస్తున్నారని వెల్లడించారు.

ఇప్పటికే ఓ స్నేహితుడు అది నిజం అని భావించి రూ.20 వేలు పంపి మోసపోయారని తెలిపారు. కాబట్టి తన పేరుతో ఉన్న ఖాతాలో డబ్బులు పంపాలని వచ్చే మెసేజ్లను ఎవరూ నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.

అనుమానాస్పద లింక్లు, మెసేజ్లు, వీడియో కాల్స్ వస్తే వెంటనే బ్లాక్ చేయాలని సూచించారు. ఆయా సైట్లు బ్లాక్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. సైబర్ మోసాలపై 1930 హెల్ప్ లైన్ లేదా www.cybercrime. gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని సూచించారు హైదరాబాద్ కొత్వాల్ సజ్జనార్.

You may also like
జపాన్‌ సాంకేతిక విద్యపై తెలంగాణ దృష్టి!
తస్మాత్ జాగ్రత్త.. సెల్ ఫోన్ చోరీలతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ!
TG Heat Wave Alert
తెలంగాణ ప్రజలకు అలర్ట్.. తప్పనిసరి అయితేనే బయటకు రండి!
azharuddin and kodandaram as mlc
ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, కోదండరాంప్రమాణ స్వీకారం.. మంత్రి పదవికి వీడిన గండం!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions