Tuesday 4th August 2026
12:07:03 PM
Home > తాజా > బిహార్ లో ఒకే సీటు గెలిచిన పార్టీ.. అది కూడా ఎన్ని ఓట్లతో అంటే..!

బిహార్ లో ఒకే సీటు గెలిచిన పార్టీ.. అది కూడా ఎన్ని ఓట్లతో అంటే..!

bsp wins only one seat in bihar

BSP Wins One Seat | బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో (Bihar Assembly Elections) ఎన్డీఏ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో కొన్ని ఆసక్తికర విజయాలు నమోదు అయ్యాయి. బిహార్ లో బహుజన్ సమాజ్ పార్టీ (BSP) కూడా పోటీ చేసింది.

మొత్తం 192 స్థానాల్లో పోటీ చేసిన ఆ పార్టీ.. కేవలం ఒకే ఒక్క సీటు మాత్రమే గెలుచుకోగలిగింది. అది కూడా కేవలం 30 ఓట్ల తేడాతో ఆ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. బీఎస్పీ కి చెందిన సతీష్ కుమార్ యాదవ్ రామ్ గఢ్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు.

శుక్రవారం జరిగిన కౌంటింగ్లో ఇక్కడ పోరు హోరాహోరీగా కొనసాగింది. ఓట్ల లెక్కింపు సమయంలో సతీష్ ఎక్కువగా ఆధిక్యంలోనే నిలిచారు. రౌండ్ రౌండ్ కు ఆధిక్యత మారుతూ వచ్చింది. చివరికి 72,689 ఓట్లు సాధించిన సతీష్ యాదవ్ గెలుపొందారు. ఆయన ప్రత్యర్థిగా బీజేపీ నుంచి బరిలోకి దిగిన అశోక్ కుమార్ సింగ్ 72,659 ఓట్లను సాధించారు. దీంతో సతీశ్ యాదవ్ కేవలం 30 ఓట్ల తేడాతో విజయం సాధించారు.  

You may also like
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions