Monday 14th September 2026
12:07:03 PM
Home > తాజా > ‘కొత్త పార్టీ ప్రచారంపై హరీష్ రావు రియాక్షన్’

‘కొత్త పార్టీ ప్రచారంపై హరీష్ రావు రియాక్షన్’

Harish Rao News Latest | మాజీ మంత్రి, బీఆరెస్ నేత హరీష్ రావు కొత్త రాజకీయ పార్టీని స్థాపించనున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.

హరీష్ రావు నూతన రాజకీయ పార్టీని స్థాపిస్తారా లేక బీజేపీలోకి వెళ్తారా అనే శీర్షికతో కొన్ని పేపర్ క్లిప్పులు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ తరుణంలో హరీష్ రావు స్పందించారు. ప్రచారంలో ఉన్న సదరు పేపర్ క్లిప్పింగులు ఫేక్ అని హరీష్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఐటీ సెల్ ద్వారా ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

కాంగ్రెస్ చేస్తున్న ఇలాంటి వికృత చేష్టలు, దివాలా కోరు, దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. పాలన చేతకాదు, సమాధానం చెప్పే దమ్ములేదు, కానీ దుష్ప్రచారంలో మాత్రం కాంగ్రెస్ నంబర్ వన్ అని దుయ్యబట్టారు. ఇలాంటి చిల్లర చేష్టలు మనకపోతే చట్టపరమైన చర్యలు ఉంటాయని హరీష్ వార్నింగ్ ఇచ్చారు.

You may also like
జపాన్‌ సాంకేతిక విద్యపై తెలంగాణ దృష్టి!
తస్మాత్ జాగ్రత్త.. సెల్ ఫోన్ చోరీలతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ!
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions