Thursday 15th October 2026
12:07:03 PM
Home > తాజా > ‘కవిత విజ్ఞతకే వదిలేస్తున్న’

‘కవిత విజ్ఞతకే వదిలేస్తున్న’

Harish Rao About Kavitha Comments | తనపై కవిత చేసిన తీవ్ర ఆరోపణలపై స్పందించారు మాజీ మంత్రి, బీఆరెస్ నాయకులు హరీష్ రావు. తన 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం తెలంగాణ ప్రజల ముందు తెరిచిన పుస్తకం లాంటిదని పేర్కొన్నారు. ​

గత కొంతకాలంగా పార్టీపైన, తనపైన కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న వ్యాఖ్యలనే కవిత కూడ చేశారని ఆ వ్యాఖ్యలు ఎందుకు చేశారనేది ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నట్లు కీలక వ్యాఖ్యలు చేశారు. ​కేసీఆర్ నాయకత్వంలో రెండున్నర దశాబ్దాలుగా ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా, రాష్ట్ర సాధనలో, రాష్ట్ర అభివృద్ధిలో తాను చూపిన నిబద్ధత, తన పాత్ర అందరికీ తెలుసన్నారు. ​

కేసీఆర్ కాలంలో ఎంతో కష్టపడి నిర్మించిన వ్యవస్థలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఒక్కొక్కటిగా కూల్చే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ​కేసీఆర్ నాయకత్వంలో తిరిగి బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకొని, ప్రజలు పడుతున్న కష్టాలను తొలగించడానికి కలిసికట్టుగా ముందుకు సాగనున్నట్లు హరీష్ స్పష్టం చేశారు.

You may also like
జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ!
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions