Thursday 15th October 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > 3,400 లిప్‌స్టిక్ ముద్దులతో కార్‌ డెకరేషన్.. వైరల్ అయిన పిచ్చి ట్రెండ్!

3,400 లిప్‌స్టిక్ ముద్దులతో కార్‌ డెకరేషన్.. వైరల్ అయిన పిచ్చి ట్రెండ్!

  • రూ. 5,500 ఫైన్ బాదిన పోలీసులు!

3400 Lipstick Kisses On Car మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ వీధుల్లో ప్రయాణిస్తున్న ఒక కారు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కారు అంతటా సుమారు 3,400 లిప్‌స్టిక్ ముద్దు గుర్తులు (Lipstick Kisses) ఉండటంతో రోడ్డుపై వెళ్లే వారంతా దాన్నే వింతగా చూశారు. అయితే ఈ విచిత్రమైన సరదా, కారు యజమానికి భారీ చలాన్‌తో గట్టి షాక్ ఇచ్చింది.

గ్వాలియర్‌కు చెందిన ఆదిత్య సికర్వార్ అనే యువకుడి కారుపై ఈ విచిత్రమైన ప్రయోగం జరిగింది. ఆదిత్య స్నేహితురాలు ఒక విదేశీ సోషల్ మీడియా ట్రెండ్ నుండి ప్రేరణ పొంది, దానిని ఈ కారుపై రీ-క్రియేట్ చేయాలని భావించింది.

కారు బాహ్య భాగానికి ఏకంగా 3,400 లిప్‌స్టిక్ ముద్రలను ఒక్కొక్కటిగా వేయడానికి సదరు యువతికి సుమారు 4 గంటల సమయం పట్టింది. ముద్దు గుర్తులతో నిండిన ఈ కారు రోడ్లపై తిరుగుతుంటే ప్రజల దృష్టిని విపరీతంగా ఆకర్షించింది. కారు ఫోటోలు, వీడియోలు ఆన్‌లైన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో క్షణాల్లో వైరల్‌గా మారాయి.

రంగంలోకి పోలీసులు – ₹5,500 చలాన్..

సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ కావడంతో ట్రాఫిక్ పోలీసులు వెంటనే స్పందించారు. చిత్రాలలో స్పష్టంగా కనిపిస్తున్న రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా పోలీసులు ఆ వాహనాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. యజమాని ఆదిత్యను పిలిపించి విచారించిన అనంతరం, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను రూ. 5,500 చలాన్ జారీ చేశారు.

పోలీసుల చర్యతో తన తప్పును అంగీకరించిన ఆదిత్య సికర్వార్, వెంటనే కారును శుభ్రం చేయించి (వాటర్ వాష్) లిప్‌స్టిక్ మరకలన్నింటినీ తొలగించి పాత రూపాన్ని పునరుద్ధరించాడు.

You may also like
శాండ్‌విచ్ షాప్‌ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రోబో!
‘ఆగస్ట్ 25’న సంచలనం పేరుతో రూ.8.5 కోట్ల వసూలు?
ప్రేమలో విఫలమైతే 7 రోజులు పెయిడ్ లీవ్స్!
లక్షల జీతం.. అయినా వీకెండ్స్‌ లో ‘ర్యాపిడో’ డ్రైవర్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions