Wednesday 26th August 2026
12:07:03 PM
Home > క్రైమ్ > ‘ఆగస్ట్ 25’న సంచలనం పేరుతో రూ.8.5 కోట్ల వసూలు?

‘ఆగస్ట్ 25’న సంచలనం పేరుతో రూ.8.5 కోట్ల వసూలు?

August 25 Viral Video Controversy సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారంతో (Hype) నెటిజన్లను ఆకర్షించి, ఆ తర్వాత ఊహించని విధంగా షాక్ ఇచ్చిన ఒక ఆన్‌లైన్ ఘటన తీవ్ర ఆగ్రహానికి, చర్చకు దారితీసింది. ఒక పెద్ద విషయాన్ని వెల్లడిస్తానని నమ్మించి, చివరికి మోటివేషనల్ వీడియో షేర్ చేయడంపై నెటిజన్లు ఆరోపణల వర్షం కురిపిస్తున్నారు.

అసలేం జరిగిందంటే..

’25 ఆగస్ట్ 2026′ పేరుతో సృష్టించిన ఒక ఖాతా ద్వారా ఈ వ్యవహారం ప్రారంభమైంది. సదరు క్రియేటర్ కొన్ని రోజుల పాటు ఆగస్ట్ 25న ఒక పెద్ద విషయాన్ని వెల్లడిస్తానని, అది చూస్తే ఎవరూ నిరాశ చెందరు అని ప్రకటిస్తూ వరుసగా రీల్స్ పోస్ట్ చేశాడు.

ఈ వీడియోలకు లక్షల్లో వ్యూస్ రావడంతో, ఇన్‌స్టాగ్రామ్ నుండి ఈ వీడియో తొలగిస్తారని, దాన్ని టెలిగ్రామ్‌లో విడుదల చేస్తానని చెబుతూ ఒక లింక్‌ను షేర్ చేశాడు.

రూ.500 వసూలు.. రూ.8.5 కోట్ల రాబడి?

టెలిగ్రామ్ లింక్‌ను అనుసరించిన వారిని సదరు వీడియో చూడటానికి రూ.500 చెల్లించాలని కోరినట్లు వినియోగదారులు ఆరోపిస్తున్నారు. దాదాపు 1.66 లక్షల మంది ఈ మొత్తాన్ని జమ చేయడంతో, దాదాపు రూ. 8.5 కోట్లు వసూలైనట్లు సోషల్ మీడియాలో కథనాలు ప్రచారమవుతున్నాయి.

డబ్బులు చెల్లించిన తర్వాత వాగ్దానం చేసిన కంటెంట్‌ను విడుదల చేశారు. అయితే, ఎంతో ప్రచారం చేసిన సంచలనానికి బదులుగా, అది కేవలం ఒక సాధారణ మోటివేషనల్ వీడియో అని తేలడంతో డబ్బులు చెల్లించిన వారు నివ్వెరపోయారు.

నెట్టింట తీవ్ర ఆగ్రహం..

పెద్ద విషయాన్ని వెల్లడిస్తామని చెప్పి తమను మోసం చేశారంటూ బాధితులు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ ఘటనపై వీడియోలు, పోస్టులు పెడుతూ ఆందోళన వ్యక్తం చేస్తుండటంతో, ప్రస్తుతం ఈ అంశం సోషల్ మీడియాలో అత్యంత వేగంగా వైరల్ అవుతోంది.

You may also like
3,400 లిప్‌స్టిక్ ముద్దులతో కార్‌ డెకరేషన్.. వైరల్ అయిన పిచ్చి ట్రెండ్!
ప్రేమలో విఫలమైతే 7 రోజులు పెయిడ్ లీవ్స్!
CJP నేతల వీడియోలు వైరల్.. విద్యార్థుల విమర్శలు!
లక్షల జీతం.. అయినా వీకెండ్స్‌ లో ‘ర్యాపిడో’ డ్రైవర్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions