Tuesday 1st September 2026
12:07:03 PM
Home > తాజా > బీహార్, యూపీ సమాజం నిర్వహించిన ఛాత్ పూజలో ఈటల

బీహార్, యూపీ సమాజం నిర్వహించిన ఛాత్ పూజలో ఈటల

Eatala Rajender News | మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్ పేట చెరువుదగ్గర నిర్వహించిన ఛాత్ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఎంపీ ఈటల రాజేందర్. బీహార్ యూపీ సమాజం దీపావళి పండుగ ఆరు రోజుల తర్వాత.. నాలుగు రోజుల పాటు ఛాత్ పూజ చేసుకుంటారు. సూర్య భగవానుడికి పూజ చేసి శక్తి, ఆశీర్వాదం అందించాలని ప్రజలు పూజలు చేస్తున్నారని ఈటల పేర్కొన్నారు.

ప్రపంచ ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని పూజించడం సంతోషకరమన్నారు. ఈ సందర్భంగా ఛాత్ పూజను జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు తెలుయజేశారు. హైదరాబాదులో మాత్రమే కాదు దేశమంతా బీహార్, యూపీ, బెంగాల్ వారు విస్తరించి ఉన్నారని నిర్మాణ రంగంలో ఎక్కువమంది బిహారి లు పనిచేస్తున్నారని గుర్తు చేశారు. తెలంగాణ పల్లెల్లో పొలం పనులు కూడా బిహారిలు చేస్తున్నారన్నారు.

డైరీ ఫాంలో, కాటన్, మిర్చి, రైస్ మిల్స్, కన్స్ట్రక్షన్ లలో పని చేసేవారు ఎవరున్నారు అంటే అది యూపీ, బీహార్ వాళ్ళే అని అన్నారు. కరోనా సమయంలో తాను ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రతిరోజు వేలమంది ప్రజలు నడుచుకుంటూ ఉత్తర భారత దేశానికి వెళ్తామని బయలుదేరారని, అప్పుడే దాదాపు 17 లక్షల మంది ఉత్తర భారతదేశం నుంచి వచ్చి తెలంగాణలో పనిచేస్తున్నట్లు తనకు తెలిసిందన్నారు. దేశాభివృద్ధిలో వారి పాత్ర మరువలేనిది కొనియాడారు. ఎన్నికలలో హామీ ఇచ్చినట్లు బీహార్ యూపీ మొత్తంగా ఉత్తర భారత ప్రజలకు ఏ సమస్య వచ్చినా తాను అండగా ఉంటానన్నారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions