Monday 3rd August 2026
12:07:03 PM
Home > తాజా > కేసీఆర్ ఎడమ తుంటికి ఫ్రాక్చర్ అయిందన్న డాక్టర్లు

కేసీఆర్ ఎడమ తుంటికి ఫ్రాక్చర్ అయిందన్న డాక్టర్లు

Doctors said that KCR's left hip is fractured

-కేసీఆర్ ఎడమ తుంటికి ఫ్రాక్చర్ అయిందన్న డాక్టర్లు
-విరిగిన తుంటిని రీప్లేస్ చేయాల్సి ఉందని వెల్లడి
-కోలుకోవడానికి 6 నుంచి 8 వారాల సమయం పడుతుందన్న డాక్టర్లు

తన నివాసంలోని బాత్రూమ్ లో కేసీఆర్ స్లిప్ అయ్యారని. దీంతో సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి ఆయనను తీసుకొచ్చారని ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ తెలిపారు. సీటీ స్కాన్ తో పాటు పలు పరీక్షలను నిర్వహించిన అనంతరం ఆయన ఎడమ తుంటికి ఫ్రాక్చర్ అయినట్టు గుర్తించామని చెప్పారు. ఆయన ఎడమ తుంటిని రీప్లేస్ చేయాల్సి ఉందని వెల్లడించారు. ఇలాంటి కేసుల్లో కోలుకోవడానికి 6 నుంచి 8 వారాల సమయం పడుతుందని చెప్పారు. ఆర్థోపిడిక్, అనస్తీషియా, జనరల్ మెడిసిన్, పెయిన్ మెడిసిన్ విభాగాలకు చెందిన మల్టీ డిసిప్లినరీ టీమ్ ఆయనను పర్యవేక్షిస్తోందని తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. క్రమం తప్పకుండా కేసీఆర్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన అప్డేట్స్ ను అందిస్తామని తెలిపారు.

You may also like
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
బీఆరెస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions