Monday 3rd August 2026
12:07:03 PM
Home > తాజా > ప్రజాభవన్ లో ప్రజా దర్బార్.. అర్జీలతో భారీ తరలివచ్చిన ప్రజలు!

ప్రజాభవన్ లో ప్రజా దర్బార్.. అర్జీలతో భారీ తరలివచ్చిన ప్రజలు!

CM Revanth In Prajadarbar

Praja Darbar In Praja Bhavan | తెలంగాణ నూతన సిఎం రేవంత్ రెడ్డి గురువారం నాడు ప్రమాణ స్వీకారం అనంతరం ప్రసంగిస్తూ, శుక్రవారం నుండి జ్యోతిరావ్ ఫూలే ప్రజా భవన్ లో ప్రజా దర్బార్ నిర్వహిస్తామని ప్రకటించారు.

ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం నుండి బేగంపేట లోని ప్రజా భవన్ కు ప్రజలు తమ అర్జీలతో భారీగా తరలి వచ్చారు. అక్కడే ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ వద్ద ప్రజల అర్జీలను నమోదు చేసుకున్నారు సంబంధిత అధికారులు. అనంతరం లోనికి పంపించారు.

స్వయంగా సిఎం రేవంత్ రెడ్డి అర్జీలను స్వీకరించి వాటిని పరిశీలించారు. అలాగే ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు సిఎం.

ఆయన వెంట మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు  సచివాలయం కు బయలుదేరారు సీఎం రేవంత్. అక్కడ విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించనున్నారు.

You may also like
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!
“మా పెద్దిని కాపాడండి”: డాక్టర్లకు కేసీఆర్ విజ్ఞప్తి!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions