Sunday 30th August 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ట్రంప్ వార్నింగ్..మళ్లీ ఆయుధం చేతపడుతానన్న దేశాధినేత

ట్రంప్ వార్నింగ్..మళ్లీ ఆయుధం చేతపడుతానన్న దేశాధినేత

Colombian President Gustavo Petro rejects Donald Trump threats | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు ధీటుగా బదులిచ్చారు కొలంబియా దేశాధినేత గుస్తావో పెట్రో. తాను ఆయుధాలు పట్టనని గతంలో ప్రమాణం చేశానని కానీ అవసరం అయితే మాతృభూమి రక్షణ కోసం తుపాకీ చేతపట్టుకునేందుకు కూడా సిద్ధమే అని సంచలన వ్యాఖ్యలు చేశారు. 1990 కంటే ముందు వరకు గెరిల్లా పోరాటంలో పనిచేసిన ఈయన ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. కాగా వెనెజువెలా దేశంపై సైనిక చర్య చేపట్టిన అమెరికా సైన్యం ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో మరియు ఆయన భార్యను బంధించి అమెరికా తీసుకెళ్లింది. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన ట్రంప్ కొలంబియా అధ్యక్షుడిపై విరుచుకుపడ్డారు. ఆయన పద్ధతి బాగోలేదన్నారు. ఆ దేశంలో కొకైన్ డ్రగ్ ను ఉత్పత్తి చేసి అమెరికాకు తరలిస్తున్నారని ఆరోపించారు. పద్ధతి మార్చుకోకపోతే వెనెజువెలా పరిస్థితే ఉత్పన్నం అవుతుందన్నారు.

దింతో ట్రంప్ హెచ్చరికలపై తాజగా స్పందించారు కొలంబియా అధ్యక్షుడు. తమ దేశ ప్రజల అభిమాన అధ్యక్షుడిని బంధిస్తే ప్రజల ఆగ్రహానికి గురవాల్సి ఉంటుందని అమెరికాకు హెచ్చరికలు జారీ చేశారు. దేశ ప్రజలపై బాంబులు వేస్తామంటే ప్రజలు గెరిల్లాలుగా మారుతారన్నారు. వెనెజువెలా అధ్యక్షుడి నిర్బంధాన్ని ఖండించిన ఆయన తాను ఇక్కడే ఉన్నాను, దమ్ముంటే తీసుకెళ్లండి అంటూ అమెరికాకు స్పష్టం చేశారు. గెరిల్లా పోరాటం తర్వాత ఆయుధాలు వీడిన తాను అవసరం అయితే మాతృభూమి కోసం మళ్లీ తుపాకులు చేత పట్టేందుకు సిద్ధమే అని సంచలన ప్రకటన చేశారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions