Tuesday 15th September 2026
12:07:03 PM
Home > తాజా > పవర్ కట్స్ పై సీఎం రేవంత్ ఆగ్రహం.. కీలక ఆదేశాలు!

పవర్ కట్స్ పై సీఎం రేవంత్ ఆగ్రహం.. కీలక ఆదేశాలు!

cm revath reddy

CM Revanth Fires On Power Cuts | రాష్ట్రంలో ఎక్కడైనా అకారణంగా విద్యుత్ స‌ర‌ఫ‌రాకు అంతరాయం కలిగితే బాధ్యులైన అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సీఎం రేవంత్.

ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు, విద్యుత్తుపై దుష్ప్రచారం చేసేందుకు కొందరు కుట్రలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు.

అటువంటి అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే కుట్రలను సహించేది లేదని సీఎం వార్నింగ్ ఇచ్చారు.

ఇప్పుడున్న అవసరాలకు సరిపడేంత విద్యుత్తును ప్రభుత్వం సరఫరా చేస్తోందని, ప్రభుత్వం తరఫున ఎక్కడా విద్యుత్తు కోతలను విధించటం లేదని సీఎం స్పష్టం చేశారు.

ఇటీవల పలు చోట్ల విద్యుత్తు సరఫరా నిలిపేసిన సంఘటనలపై ముఖ్యమంత్రి విద్యుత్తు శాఖ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు.

You may also like
cm revanth speech
ఇది 4 కోట్ల ప్రజలకు జరిగిన అవమానం’: అసెంబ్లీలో సీఎం రేవంత్ ఆగ్రహం!
మీరాలం ట్యాంక్ అభివృద్ధి పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన సీఎం!
గోల్కొండ కోటపై జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి!
నగరంలో రోడ్ల వ్యవస్థ.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions