Monday 14th September 2026
12:07:03 PM
Home > తాజా > కేసీఆర్ కు సీఎం రేవంత్ బర్త్ డే విషెస్!

కేసీఆర్ కు సీఎం రేవంత్ బర్త్ డే విషెస్!

kcr revanth

CM Revanth Wishes KCR | తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆరెస్ (BRS) అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (Kalvakuntla Chandrasekhar Rao) సోమవారం తన 71 పుట్టినరోజు జరుపుకొంటున్నారు.

ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా గులాబీ శ్రేణులు తమ అధినేతకు మీడియా, సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్(KCR) కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణా సీఎంఓ (Telangana CMO) అధికారిక ఎక్స్ అకౌంట్ వేదికగా కేసీఆర్ కు బర్త్ డే విషెస్ తెలిపారు. “గజ్వేల్ నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) గారు వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు.

నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు” అని తెలంగాణ సీఎంఓ హ్యాండిల్ ఎక్స్ లో పోస్ట్ చేసింది.

You may also like
ఆయన వన్ టైం వండర్.. సీఎం రేవంత్ పై సంజయ్ బారు కీలక వ్యాఖ్యలు!
జపాన్‌ సాంకేతిక విద్యపై తెలంగాణ దృష్టి!
తస్మాత్ జాగ్రత్త.. సెల్ ఫోన్ చోరీలతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ!
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions