Sunday 13th September 2026
12:07:03 PM
Home > తాజా > మూసీ అభివృద్ధిపై సీఎం సమీక్ష!

మూసీ అభివృద్ధిపై సీఎం సమీక్ష!

cm revanth meeting

CM Revanth On Moosi Development | మూసీ నదీ పరివాహక అభివృద్ధిపై నానక్ రామ్ గూడ హెచ్ఎండీఏ (HMDA) కార్యాలయంలో అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మూసీ రివర్ బౌండరీస్ లొకేషన్ స్కెచ్ తో పాటు పలు వివరాలను అధికారులు సీఎంకు వివరించారు.

అనంతరం సీఎం రేవంత్ మాట్లాడుతూ మూసీ అభివృద్ధి ప్రక్రియ వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు కసరత్తు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దానికోసం ముందుగా మూసీ క్లీనింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.

నగరంలోని చారిత్రక కట్టడాలను కలుపుతూ ఉండేలా మూసీ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని సీఎం పేర్కొన్నారు. అధికారులకు పని విభజన చేసి మూసీ నదీ పరివాహక అభివృద్ధికి చర్యలు వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

You may also like
ఆయన వన్ టైం వండర్.. సీఎం రేవంత్ పై సంజయ్ బారు కీలక వ్యాఖ్యలు!
సనత్ నగర్ టిమ్స్ ప్రారంభించిన సీఎం రేవంత్!
తెలంగాణలో వారికి కూడా పెన్షన్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions