Sunday 27th September 2026
12:07:03 PM
Home > తాజా > రాంచరన్ కు మెగాస్టార్, పవర్ స్టార్ బర్త్ డే విషెస్

రాంచరన్ కు మెగాస్టార్, పవర్ స్టార్ బర్త్ డే విషెస్

Chiranjeevi, Pawan kalyan extends Birthday Wishes To Ram Charan | గ్లోబల్ స్టార్ రాంచరణ్ పుట్టినరోజు సందర్భంగా తండ్రి మెగాస్టార్ చిరంజీవి, బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు.

రాంచరణ్ కు బర్త్ డే విషెస్ తెలిపిన చిరంజీవి గురువారం విడుదల చేసిన ‘పెద్ది’ ఫస్ట్ లుక్ పై స్పందించారు. ‘పెద్ది’ మూవీలోని చరణ్ లుక్ చాలా ఇంటెన్స్ గా ఉందని పేర్కొన్నారు. ఈ మూవీ చరణ్ నటనలోని మరో కోణాన్ని అవిష్కరిస్తుందని, అలాగే అభిమానులను కన్నులపండువగా ఉంటుందని తెలిపారు. మరోవైపు చరణ్ బర్త్ డే నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విషెస్ తెలిపారు.

‘వెండి తెరపై కథానాయకుడిగా తనదైన శైలిని ఆవిష్కరిస్తున్న రాంచరణ్ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. రామ్ చరణ్ కు మరిన్ని విజయాలు, ఆనందోత్సాహాలు ఇవ్వాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. తొలి చిత్రం నుంచీ ప్రతి అడుగులో ప్రేక్షకులను మెప్పిస్తూనే… ఎప్పటికప్పుడు నవ్యరీతిలో పాత్రలను ఎంచుకొంటున్నారు.

మరో వైపు రామ్ చరణ్ చేస్తున్న సేవా కార్యక్రమాలు ఆయనలోని సామాజిక బాధ్యతను తెలియచేస్తున్నాయి. నటనలో విభిన్న శైలి చూపడం, పెద్దలపట్ల గౌరవ భావన, ఆధ్యాత్మిక చింతన, సమాజం పట్ల బాధ్యత… రామ్ చరణ్ ఎదుగుదలకు కచ్చితంగా దోహదం చేస్తాయి. సమున్నత స్థాయిలో నిలవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను’ అని పవన్ పేర్కొన్నారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions