Thursday 30th July 2026
12:07:03 PM
Home > తాజా > ’16 రోజులు ఒక్క మనిషిని కూడా చూడలేదు’

’16 రోజులు ఒక్క మనిషిని కూడా చూడలేదు’

cm revanth

  • కరుడుగట్టిన నేరస్థుడిలా బంధించారు
  • నా బిడ్డ లగ్న పత్రికకు వెళ్లడానికి అడ్డుకున్నారు
  • కోపాన్ని బిగపట్టుకున్నా.. కక్ష సాధించలేదు
  • చెంపలు వాయించే శక్తి ఉన్నా సంయమనం పాటించా
  • శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి భావోద్వేగం
  • సీఎం రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి స్పీచ్, తెలంగాణ అసెంబ్లీ,

CM Revanth Emotional in Assembly | తెలంగాణ బడ్జెట్ శాసనసభ సమావేశాలు (Telangana Assembly Sessions) హాట్ హాట్ గా సాగుతున్నాయి. అధికార, విపక్ష పార్టీల మధ్య కౌంటర్లు, ఎన్ కౌంటర్లతో సభ దద్దరిల్లిపోతోంది.

తాజాగా గురువారం సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సభలో సుదీర్ఘంగా మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) వ్యాఖ్యలకు సీఎం కౌంటర్ ఇచ్చారు. తాము నిజంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే వాళ్లు అక్కడ కూర్చుని నోటికొచ్చినట్లు మాట్లాడేవారు కాదనీ, చంచలగూడ జైల్లోనో, చర్లపల్లి జైల్లోనో తమని పెట్టినచోటే ఉండేవారు అని వ్యాఖ్యానించారు.

Read Also: అవయవదానానికి సిద్ధం..కేటీఆర్ ప్రకటన

“డ్రోన్ ఎగరేస్తే రూ. 500 ఫైన్ వేస్తారు.. కానీ అధికారం అడ్డుపెట్టుకుని ఎంపీగా ఉన్న నన్ను చర్లపల్లి జైల్లో పెట్టారు. 16 రోజులు నన్ను డిటెన్షన్ సెల్లో ఒక మనిషి కూడా కనిపించకుండా మమ్మల్ని నిర్బంధించినా ఆ కోపాన్ని బిగపట్టుకున్నాం. తప్ప కక్ష సాధింపునకు పాల్పడలేదు. లైట్లు ఆన్ లోనే పెట్టి ఒక్క రాత్రి కూడా పడుకోకుండా జైల్లో గడిపేలా చేశారు.

కరుడు గట్టిన నేరస్తున్ని బంధించినట్లు ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న నన్ను బంధించారు. వాళ్ల తప్పులను దేవుడు చూస్తాడు.. అంతకు అంత అనుభవిస్తారు అనుకుని ఊరుకున్నా. నా మీద కక్ష చూపిన వారిని దేవుడే ఆసుపత్రిపాలు చేశాడు. చర్లపల్లి జైలు నుంచి నా బిడ్డ లగ్నపత్రిక రాసుకోవడానికి వెళ్లకుండా అడ్డుకున్నారు.

Also Read: పవన్ పై జగన్ హాట్ కామెంట్స్

రాజకీయ కక్ష సాధింపులంటే మీవి కదా. అయినా నేను కక్షసాధింపు చర్యలకు పాల్పడలేదు. నిజంగానే నేను కక్ష సాధించాలనుకుంటే మీ కుటుంబమంతా చర్లపల్లి జైల్లో ఉండేవారు. కానీ ఆ పని నేను చేయలేదు. మేం విజ్ఞత ప్రదర్శించాం. ప్రజలు అధికారం ఇచ్చింది నా కక్ష తీర్చుకోవడానికి కాదని నేను విజ్ఞత ప్రదర్శించా.

సొంతపార్టీ ఆఫీసులో బూతులు తిట్టించి రికార్డు చేయించినా, చెంపలు వాయించే శక్తి ఉన్నా నేను సంయమనం పాటించా. ఎవరివి కక్ష సాధింపు చర్యలో తెలంగాణ సమాజం ఇదంతా గమనిస్తోంది” అని విమర్శించారు సీఎం రేవంత్.

You may also like
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!
‘పనికిరాని నిరుద్యోగి’.. సీజేపీ నేతపై కంగనా ఘాటు వ్యాఖ్యలు!
“కొడంగల్‌లో 11 వేల కర్ణాటక ఓట్లు”.. కవిత సంచలన ఆరోపణలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions