Saturday 8th August 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > చంద్రబాబు గారు అది మా బాధ్యత : మెగాస్టార్ చిరంజీవి

చంద్రబాబు గారు అది మా బాధ్యత : మెగాస్టార్ చిరంజీవి

Chiranjeevi Meets Cm Chandrababu | తెలుగురాష్ట్రాల వరద బాధితుల సహాయార్ధం మెగాస్టార్ చిరంజీవి ( Megastar Chiranjeevi ) భారీ విరాళం ప్రకటించిన విషయం తెల్సిందే.

ఇందులో భాగంగా శనివారం దసరా పండుగ సందర్భంగా హైదరాబాద్ ( Hyderabad ) లోని సీఎం చంద్రబాబు ( Cm Chandrababu )నివాసానికి వెళ్లారు చిరంజీవి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని కలిసి రూ.50 లక్షల చెక్కును అందజేశారు.

అలాగే తనయుడు రామ్ చరణ్ ( Ram Charan ) తరఫున మరో రూ.50 లక్షల చెక్కును అందించారు. ఈ నేపథ్యంలో స్పందించిన సీఎం చంద్రబాబు చిరంజీవికి ధన్యవాదాలు తెలుపుతూ ఎక్స్ ( X )వేదికగా పోస్ట్ చేశారు.

మానవసేవలో చిరంజీవి ఎప్పూడూ ముందుంటారు అని కొనియాడారు. రూ.కోటి విరాళం అందించిన చిరంజీవి, రామ్ చరణ్ కు కృతజ్ఞతలు చెప్పారు.

సీఎం చంద్రబాబు పోస్ట్ పై తాజాగా చిరంజీవి స్పందించారు. మన ప్రజలకు విపత్తు ఎదురైనప్పుడు సహాయం అందించడం మన బాధ్యత అని చిరంజీవి గుర్తుచేశారు. వరద బాధితులను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి సహాయక చర్యలు ఆదర్శం అని మెగాస్టార్ పేర్కొన్నారు.

You may also like
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions