Wednesday 2nd September 2026
12:07:03 PM
Home > Uncategorized > పోచంపల్లిలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు!

పోచంపల్లిలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు!

  • జాతీయ జెండా ఆవిష్కరించిన బీజేపీ నేతలు..
  • అమరులకు నివాళి!

పోచంపల్లి (దోతిగూడెం): సబ్బండ వర్ణాల పోరాటం, ఎంతో మంది అమరవీరుల ప్రాణ త్యాగాలతో సిద్ధించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మండల కేంద్రంలోని దోతిగూడెం గ్రామంలో ఘనంగా జరిగాయి.

తెలంగాణ స్వరాష్ట్రం సిద్ధించి పుష్కర కాలం (12 ఏళ్లు) పూర్తయిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పోచంపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు.

బీజేపీ పోచంపల్లి మండల అధ్యక్షుడు మేకల రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు మేకల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ చరిత్రలో జూన్ 2 ఒక గొప్ప పర్వదినమని కొనియాడారు.

సబ్బండ వర్ణాల పోరాటంతో పాటు పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందడంలో భారతీయ జనతా పార్టీ అందించిన సహకారం, పోషించిన పాత్ర ఎప్పటికీ మరిచిపోలేనిదని ఆయన గుర్తు చేశారు.

అనంతరం గ్రామంలో జాతీయ జెండాను ఆవిష్కరించి, తెలంగాణ అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి వారి త్యాగాలను స్మరించుకున్నారు.

ఈ పుష్కర కాలంలో గడిచిన 12 ఏళ్లలో  తెలంగాణ రాష్ట్ర అభ్యున్నతికి, మౌలిక వసతుల కల్పనకు భారీగా నిధులు కేటాయిస్తూ తోడ్పాటు అందించిన ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజల తరఫున ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

మున్ముందు మన తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించి దేశానికే తలమానికంగా మారాలని ఆకాంక్షించారు.

ఈ  వేడుకల్లో బీజేపీ పోచంపల్లి మండల జనరల్ సెక్రెటరీ ముద్దం హరీష్, బీజేపీ సీనియర్ నాయకులు, దోతిగూడెం గ్రామ ఉపసర్పంచ్ బద్దం వెంకటరెడ్డి, బూత్ అధ్యక్షులు యాట శ్రీనాథ్, పార్టీ సీనియర్ నాయకులు గుమ్మి దామోదర్ రెడ్డి, జంగయ్య, వస్పరి రాకేష్, పి. వెంకటేష్, బి. కిరణ్, కె. మణికంఠ, వై. విజయ్ మరియు తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

You may also like
‘కాంగ్రెస్ పాలనలో తెలంగాణ 25 ఏళ్లు వెనక్కి’
సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యం!
విద్రోహ శక్తుల నుండి రాష్ట్రాన్ని కాపాడుకుందాం: కేసీఆర్
జూన్ 2 ఒక భావోద్వేగ సందర్భం: సీఎం రేవంత్ రెడ్డి!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions