Arvind Kejriwal Loses New Delhi Seat | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ( AAP )కి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆప్ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ ఓటమిపాలయ్యారు.
న్యూ ఢిల్లీ స్థానం నుండి పోటీ చేసిన ఆయన బీజేపీ అభ్యర్థి పర్వేశ్ సాహిబ్ సింగ్ ( Parvesh Sahib Singh ) చేతిలో ఓడిపోయారు. తొలి రెండు రౌండ్లలో మినహా కేజ్రీవాల్ ఎక్కడా పోటీ ఇవ్వలేకపోయారు.
మరోవైపు ఆప్ కీలక నేతలైన మాజీ మంత్రులు మనీష్ సిసోడియా ( Manish Sisodia ), సత్యేంద్ర జైన్ ( Satyendra Jain )కూడా ఓడిపోయారు. జంగ్ పురలో పోటీ చేసిన సిసోడియా బీజేపీ అభ్యర్థి తర్వీoధర్ సింగ్ చేతిలో పరాజయం పాలయ్యారు. షాకూర్ బస్తీ నుండి పోటీ చేసిన సత్యేంద్ర జైన్ కూడా ఓడిపోయారు.
అయితే ఢిల్లీ సీఎం అతిశీ మాత్రం విజయం సాధించడంతో ఆప్ కు స్వల్ప ఊరట లభించింది. బీజేపీ అభ్యర్థి రమేష్ బిధూరి పై పోటీ చేసిన ఆమె చివరి రౌండ్లో పుంజుకుని గెలుపొందారు.
ఇదిలా ఉండగా అర్వింద్ కేజ్రీవాల్ పై విజయ బావుటా ఎగురవేసిన పర్వేశ్ ఢిల్లీ ముఖ్యమంత్రి రేసులో ముందువరుసలో ఉన్నారు. ఇప్పటికే ఆయన కేంద్రమంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు.