Delhi Election Results 2025 | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠగా సాగుతున్నాయి. ఉదయం నుండి మొదలైన ఓట్ల లెక్కింపులో బీజేపీ అత్యధిక స్థానాల్లో లీడింగ్ లో కొనసాగుతుంది.
మరోవైపు ఆప్ అగ్ర నేతలు వెనుకంజలో ఉండడం ఆసక్తిగా మారింది. సీఎం అతిశీ, మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ వంటి కీలక నేతలు ట్రెయిలింగ్ లో కొనసాగుతున్నారు.
మరో ఆప్ నేత మనీష్ సిసోడియా మాత్రం లీడింగ్ లో కొనసాగుతున్నారు. ఇదిలా ఉండగా ఢిల్లీ అసెంబ్లీ ఫలితాల్లో తొలి ఫలితం వెలువడింది. కోండ్లీ స్థానం నుండి పోటీ చేసిన ఆప్ అభ్యర్థి కుల్దీప్ కుమార్ విజయం సాధించారు.
బీజేపీ అభ్యర్థి ప్రియాంక గౌతమ్ పై 6 293 ఓట్ల మెజారిటీతో విజయాన్ని సొంతం చేసుకున్నారు. మరోవైపు బీజేపీ కూడా ఖాతా తెరిచింది. లక్ష్మీ నగర్ స్థానం నుండి అభయ్ వర్మ విజయం సాధించారు.