Delhi Election Results 2025 | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. శనివారం ఉదయం 8 గంటల నుండి కౌంటింగ్ ప్రారంభం కాగా ఏక్సిట్ పోల్స్ ( Exit Polls ) అంచనాలను నిజం చేస్తూ బీజేపీ దూసుకెళ్తుంది.
ఆధిక్యంలో అత్యధిక స్థానాల్లో కమలం పార్టీ అభ్యర్థులు లీడింగ్ లో కొనసాగుతున్నారు. మరోవైపు ప్రస్తుతం అధికారంలో ఉన్న ఆప్ పెద్దలు వెనుకంజలో కొనసాగుతున్నారు.
మరీ ముఖ్యంగా మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ ( Arvind Kejriwal ) వెనుకంజలో ఉన్నారు. ఉదయం 11 గంటల ముప్పై నిమిషాల వరకు వెలువడిన ఫలితాలను చూస్తే న్యూ ఢిల్లీ ( New Delhi )స్థానం నుండి పోటీ చేసిన కేజ్రీవాల్ పై బీజేపీ అభ్యర్థి పర్వేశ్ లీడింగ్ లో కొనసాగుతున్నారు.
తొలుత ఆధిక్యం కనబరిచిన కేజ్రీవాల్ తొమ్మిది రౌండ్లు ముగిసే సమయానికి1,170 ఓట్లు వెనుకంజలో ఉన్నారు.
కాల్కాజి స్థానంలో ఢిల్లీ సీఎం అతిశీ 3200 ఓట్లతో వెనుకంజలో కొనసాగుతున్నారు. ఈ స్థానంలో బీజేపీ అభ్యర్థి రమేష్ బిదూరి. షాకూర్ బస్తీ నుండి పోటీ చేసిన సత్యేంద్ర జైన్ ఓటమి దిశగా వెళ్తున్నారు.