Delhi Exit Poll Results | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ (Delhi Exit Poll Results) ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 58 శాతం పోలింగ్ నమోదయ్యింది. గత ఎన్నికలతో పోలిస్తే 13 శాతం పోలింగ్ పెరిగింది. పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్‌పోల్స్ విడుదలయ్యాయి.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై నేషనల్ మీడియా ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. ఈ సారి బీజేపీ, ఆప్ మధ్య గట్టి పోటీ ఉందని పలు సర్వేలు అంచనా వేశాయి. దాదాపు మెజరిటీ సర్వేలు బీజేపీకి అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి. కొన్ని మాత్రం ఆప్ గెలిచే అవకాశం ఉందని పేర్కొన్నాయి.
మ్యాట్రిజ్ – ఆప్ 32-37, బీజేపీ 35-40, కాంగ్రెస్ 0-1 స్థానాలు
పీపుల్స్ ఇన్‌సైట్- ఆప్ 25-29, బీజేపీ 40-44, కాంగ్రెస్0-1 స్థానాలు
రిపబ్లిక్ పీమార్క్- ఆప్ 21-31, బీజేపీ 39-49, కాంగ్రెస్ 0-1 స్థానాలు
కేకే సర్వే: ఆప్ 39, బీజేపీ 22, కాంగ్రెస్ 9స్థానాలు
టైమ్స్‌నౌ: ఆప్ 22-31, బీజేపీ 39-45, కాంగ్రెస్ 0-2
పీపుల్స్ పల్స్: ఆప్ 10-19, బీజేపీ 51-60