Woman As Delhi CM | ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో (Delhi Assembly Elections) బీజేపీ సంచలన విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. మొత్తం 70 అసెంబ్లీ సీట్లలో 48 స్థానాలను దక్కించుకుని ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకుంది.
ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Admi Party) 22 స్థానాలతో ప్రతిపక్షంలో నిలిచింది. అయితే ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి 2 రోజులు గడిచినా.. ఇంకా సీఎం ఎంపికపై ఆ పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. ప్రస్తుతం ప్రధాని మోదీ విదేశీ పర్యటనలో ఉన్న నేపథ్యంలో ఈనెల 13 తర్వాతే ఢిల్లీ సీఎం ఎవరనేది స్పష్టం కానుంది.
తొలుత కేజ్రీవాల్ పై గెలిచిన పర్వేష్ వర్మ పేరు వినిపించింది. తాజాగా ఢిల్లీకి మహిళా ముఖ్యమంత్రి కావొచ్చని సంకేతాలు వెలువడుతున్నాయి. మహిళ సీఎంతోపాటు, బలహీన వర్గాల నుంచి ఒకరిని డిప్యూటీ సీఎంగా ఎంపిక చేయనున్నట్లు సమాచారం.
48 మంది ఎమ్మెల్యేల్లో నలుగురు మహిళలు ఉన్నారు. రేఖా గుప్తా, శిఖా రాయ్, పూనమ్ శర్మ, నీలం పెహల్వాడ్. వీరిలో ఒకరికి ఢిల్లీ ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించాలని.. బీజేపీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.