CM Revanth Reddy | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) గురువారం గచ్చిబౌలిలో కొత్త మైక్రోసాఫ్ట్ క్యాంపస్ (Microsoft New Campus) నిర్మాణానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మైక్రోసాఫ్ట్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేశారు.
అనంతరం సమావేశంలో ఆయన మాట్లాడుతూ నగరంలో 1.1 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త మైక్రోసాఫ్ట్ క్యాంపస్ (Microsoft Campus) ఏర్పాటు చేయబోతున్నందుకు ఆ కంపెనీ ప్రతినిధులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
రాబోయే భవిష్యత్తు అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దేనన్నారు. మైక్రోసాఫ్ట్ విస్తరణతో యువతకు మరిన్ని ఉద్యోగాలు లభించనున్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్ (Hyderabad)లో మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్ ఏర్పాటు కావడం ఐటీ ఇండస్ట్రీ జర్నీలో ఇదొక అద్భుతమైన మైలురాయి అని కొనియాడారు.
నగరంలో ఏఐ సెంటర్ ఏర్పాటుకు మైక్రోసాఫ్ట్ ఇప్పటికే ఎంవోయూ కుదుర్చుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇటీవలే ఆ కంపెనీ భారత్ కు వచ్చి 25 వసంతాలు పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు.
మైక్రోసాఫ్ట్ (Microsoft), తెలంగాణ ప్రభుత్వం భాగస్వామ్యంతో సుమారు 500 ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ (Artificial Intelligence Based) విద్యను ప్రవేశపెట్టబోతున్నామని ప్రకటించారు.