Thursday 30th July 2026
12:07:03 PM
Home > తాజా > ఇండీ కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా తెలంగాణ వ్యక్తి!

ఇండీ కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా తెలంగాణ వ్యక్తి!

justice sudershan reddy

INDI Alliance VP Candidate | భారత ఉప రాష్ట్రపతి (Vice President) పదవికి జగదీప్ ధన్కడ్ (Jagdeep Dhankhar) రాజీనామా చేయడంతో ప్రస్తుతం వైస్ ప్రెసిడెంట్ ఎన్ని దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

తదుపరి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి తమ అభ్యర్థిని ప్రకటించింది. తమిళనాడుకు చెందిన బీజేపీ నేత, ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan) పేరును ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది.

ప్రస్తుతం ఎన్డీయే కూటమి పార్టీలతోపాటు, మిగిలిన పార్టీలకు సైతం ఫోన్ చేస్తూ తమ అభ్యర్థికి మద్దతు తెలపాలని పిలుపునిచ్చింది బీజేపీ. ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ప్రతిపాదించిన అభ్యర్థి గెలుపుకు అవసరం అయిన సభ్యుల సంఖ్యా బలం ఉంది. దీంతో సీపీ రాధాకృష్ణన్ ఎన్నిక లాఛనమే.

అయినప్పటికి కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండీ కూటమి ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థిని నిలపాలని భావిస్తోంది. ఈ మేరకు మంగళవారం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge) నివాసంలో జరిగిన సమావేశంలో కూటమి నేతలతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు.

మొదట తమిళనాడుకే చెందిన దళిత నేత తిరుచ్చి శివ పేరు వినిపించినప్పటికీ, తాజాగా మరో వ్యక్తి పేరు తెరపైకి వచ్చింది. ఇండీ కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా తెలంగాణకు చెందిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి (Justice Sudarshan Reddy) పేరును కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే ప్రకటించారు.

You may also like
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions