Pawan Kalyan’s Temple Tour | ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ( Deputy Cm Pawan Kalyan ) దక్షిణ భారత రాష్ట్రాల్లోని ప్రముఖ దేవాలయాలను సందర్శిస్తున్న విషయం తెల్సిందే.
షష్ఠ షణ్ముఖ క్షేత్ర యాత్రలో భాగంగా తమిళనాడు రాష్ట్రం మధురై లోని మీనాక్షి అమ్మవారి ఆలయాన్ని పవన్ సందర్శించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
శనివారం ఉదయం మధురై జిల్లాలోని అలగర్ కొండల్లో వల్లి, దేవసేన, గణపతి సమేతంగా నెలవై ఉన్న పలముదిర్చోలై, అరుల్మిగు సోలైమలై మురుగన్ ఆలయం దర్శించుకుని, ప్రత్యేక పూజలో పాల్గొన్నారు.
పవన్ దక్షిణాది ఆలయాల పర్యటనలో భాగంగా తనయుడు అకీరా నందన్ ( Akira Nandan ) తండ్రి వెంటే ఉంటున్నారు. అలాగే టీటీడీ బోర్డు సభ్యులు ఆనంద్ సాయి కూడా డిప్యూటీ సీఎం వెంట ఉన్నారు.