Sunday 13th September 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ‘విత్ మై ఓల్డ్ ఫ్రెండ్’ అంటూ ఫొటోలు షేర్ చేసిన సీఎం.. ఆ ఫ్రెండ్ ఎవరంటే!

‘విత్ మై ఓల్డ్ ఫ్రెండ్’ అంటూ ఫొటోలు షేర్ చేసిన సీఎం.. ఆ ఫ్రెండ్ ఎవరంటే!

AP CM Chandrababu Old Car | సాధారణంగా కొంతమందికి తాము ఉపయోగిచింన వస్తువుల మీద సెంటిమెంట్ ఉంటుంది. ముఖ్యంగా తాము మొదట తిరిగిన బైకు, కార్ల మీద ప్రేమ ఉంటుంది. ఎన్నేళ్లైనా, ఎన్ని కొత్త వాహనాలు వచ్చినా వాటిని అలా దాచుకుంటుంటారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి కూడా ఇలాంటి సెంటిమెంట్ ఉంది.

ఆయనకు తన మూడు దశాబ్దాల నాటి అంబాసిడర్ కారంటే చాలా ఇష్టం. తాజాగా అమరావతిలోని టీడీపీ ఆఫీస్ లో ఆ కారును చూసి పాత జ్ఞాపకాల్లో గుర్తు చేసుకున్నారు. తన రాజకీయ ప్రయాణంలో ఆ వాహనంతో తనకున్న అనుబంధాన్ని, ప్రయాణ స్మృతులను ఆయన గుర్తు చేసుకున్నారు. ఏపీ 09 జీ 393 రిజిస్ట్రేషన్ నెంబరుతో ఉన్న ఈ అంబాసిడర్ కారు చంద్రబాబు నాయుడు సొంత వాహనం.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన తన కాన్వాయ్‌లో ఇదే కారులో రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు. ప్రస్తుతం సెక్యూరిటీ కారణాల వల్ల ఆధునిక వాహనాలను వినియోగిస్తున్నప్పటికీ, ఈ అంబాసిడర్ కారును మాత్రం చంద్రబాబు ఎంతో అపురూపంగా చూసుకుంటున్నారు. తాజాగా ఈ కారు వద్ద దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ విత్ మై ఓల్డ్ ఫ్రండ్ అంటూ చంద్రబాబు రాసుకొచ్చారు.

You may also like
ఫైళ్ల పరిష్కారంలో జాప్యం వద్దు: సీఎం చంద్రబాబు తీవ్ర హెచ్చరిక!
ప్రార్థనా స్థలాల్లో లౌడ్ స్పీకర్ల గోల.. డీజీపీకి రఘురామ కృష్ణంరాజు లేఖ!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !
నిజాయతీలో మా పిల్లలు బంగారం.. విద్యార్థినులపై మంత్రి లోకేశ్ ప్రశంసలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions