Friday 14th August 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ‘నా భార్య అందంగా ఉంటుంది.. చూడడానికి ఇష్టపడుతా’

‘నా భార్య అందంగా ఉంటుంది.. చూడడానికి ఇష్టపడుతా’

anand mahindra

Anand Mahindra On 90 Hour Work Week Debate | వారానికి 90 గంటల పని విధానం చుట్టూ సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తుంది.

ఎల్ అండ్ టి ( L&T ) ఛైర్మన్ ఎస్ ఎన్ సుబ్రహ్మణ్యన్ ( S N Subrahmanyan ) పని గంటలపై చేసిన వ్యాఖ్యలు అగ్గి రాజేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా పరోక్షంగా ఎస్ ఎన్ సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.

కాగా వారానికి 90 గంటలు పని చేయాలని, అవసరమైతే ఆదివారాలు పని చేయాలని సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యానించారు. ఇంట్లో కూర్చొని భార్యను ఎంతసేపని చూస్తారు ఆఫీస్ లో ఎక్కువ సమయం గడపాలని మీ భార్యలకు చెప్పండి అంటూ సుబ్రహ్మణ్యన్ కాంట్రావెర్సీయల్ కామెంట్స్ చేశారు.

ఈ నేపథ్యంలో ‘నా భార్య వండర్ ఫుల్. ఆమెను చూడడానికి ఇష్టపడుతా’ ( My wife is wonderful, and I love staring at her ) అంటూ ఆనంద్ మహీంద్రా చెప్పారు. ఈ మేరకు ఢిల్లీలో నిర్వహించిన వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్- 2025లో ఆయన పాల్గొన్నారు.

ఎంత సమయం పనిచేసింది కాదు, ఎంత క్వాలిటీగా వర్క్ చేశారు అనేది తనకు ముఖ్యమని ఆనంద్ మహీంద్రా చేసిన వ్యాఖ్యల్ని నెటిజన్లు సపోర్ట్ చేస్తున్నారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions