Saturday 1st August 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > పండుగకు వచ్చిన ఆంధ్రా అల్లుడు..తెలంగాణ రుచి చూపిన అత్తామామ

పండుగకు వచ్చిన ఆంధ్రా అల్లుడు..తెలంగాణ రుచి చూపిన అత్తామామ

130 Recipes for Andhra Alludu | సంక్రాంతి పండుగకు తొలిసారి ఇంటికి వచ్చిన అల్లుడికి అతిథి మర్యాదలు చేసి వివిధ రకాల వంటకాలను వడ్డించడం ఆనవాయితీగా వస్తోంది.

ఇలాంటి సంప్రదాయం గోదావరి జిల్లాల్లో అధికంగా కనిపిస్తుంది. అయితే పెళ్ళైన తర్వాత తొలిసారి ఇంటికి వచ్చిన ఆంధ్రా అల్లుడికి తెలంగాణ వంటకాల రుచిని చూపి అబ్బురపరిచారు అత్తామామలు.

హైదరాబాద్ సరూర్ నగర్ సమీపంలోని శారదా నగర్ లో నివాసముంటున్న క్రాంతి కల్పన దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్దమ్మాయికి కాకినాడకు చెందిన మల్లిఖార్జున్ తో నాలుగు నెలల క్రితం వివాహం జరిపించారు.

ఈ క్రమంలో సంక్రాంతికి తొలిసారి అల్లుడు ఇంటికి వచ్చాడు. దింతో పిండివంటలు, మాంసాహారం, శాకాహారం, బగారా, పులిహోర వంటి 130 రకాల వంటలను అల్లుడికి వడ్డించి అత్తామామలు సర్ప్రైజ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

You may also like
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions