Thursday 15th October 2026
12:07:03 PM
Home > తాజా > మహేష్-రాజమౌళి బిగ్ ఫైట్..వీడియో వైరల్

మహేష్-రాజమౌళి బిగ్ ఫైట్..వీడియో వైరల్

AI fight video of Mahesh Babu and Rajamouli | సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి మధ్య భీకర ఫైటింగ్ జరిగినట్లుగా ఉన్న ఒక వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. దింతో కొందరు అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే ఈ వీడియో ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ ద్వారా రూపొందించినది అని తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు. సదరు వీడియోపై దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందిస్తూ..సినిమా చచ్చిపోయింది అని ఆసక్తికరమైన కామెంట్ చేశారు.

ఇటీవల ఏఐతో రూపొందించిన వీడియోలు తెగ వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా సెలబ్రెటీలను పోలె విధంగా ఇలాంటి వీడియోలు రూపొందిస్తున్నారు. ఇలాంటి వీడియోలపై నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా రాజమౌళి-మహేష్ బాబు కాంబోలో వారణాసి సినిమా తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ఈ సినిమా విడుదల కానుంది.

You may also like
జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ!
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions