Friday 24th April 2026
12:07:03 PM
Home > తాజా > ముగ్గురు కార్మికులు ఆత్మహత్యాయత్నం.. శంకర్ గౌడ్ మృతి!

ముగ్గురు కార్మికులు ఆత్మహత్యాయత్నం.. శంకర్ గౌడ్ మృతి!

rtc employee shankar goud

RTC Driver Shankar Goud death | తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ కార్మికులు సమ్మె బాట పట్టిన విషయం తెల్సిందే.

ఈ క్రమంలో ముగ్గురు కార్మికులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలకలం రేపుతోంది. ఇందులో డ్రైవర్ శంకర్ గౌడ్ మృతిచెందారు.

ఆర్టీసీని విలీనం చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుందని నిరసన వ్యక్తం చేస్తూ వరంగల్ జిల్లా నర్సంపేట బస్టాండ్ ఎదుట గురువారం డ్రైవర్ కోలా శంకర్ గౌడ్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు.

శరీరం 80 శాతం వరకు కాలిపోయింది. వెంటనే ఆయన్ను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. కాగా డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు.

అపోలో డీఆర్డీఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శంకర్ గౌడ్ శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటలకు మృతి చెందారు. మరోవైపు మిర్యాలగూడ డిపోలో డ్రైవర్ గా పనిచేస్తున్న వెంకన్న నల్గొండ డిపో ఎదుట ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు.

అక్కడే ఉన్న కార్మికులు, పోలీసులు అడ్డుకోవడంతో ప్రాణ ముప్పు తప్పింది. భద్రాచలం డిపో డ్రైవర్ లింగారెడ్డి గడ్డిమందు తాగారు. ఆయనకు ప్రస్తుతం ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుంది. కార్మికుల వరుస ఆత్మహత్య యత్నం ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions